జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి.
దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి.
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని ప్రజా గాయకుడు దరువు అంజన్న, దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి,మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ పేర్కొన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాస్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ హితమే అభిమతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ద్వేయంగా జీవించే జర్నలిస్టులకు సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నమ్మిన విలువల కోసం సమాజమే కుటుంబం గా భావించి జీవించి అక్షర యోధులు జర్నలిస్టులని కొనియాడారు. వారికి అండగా నిలిచి కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
దాతృత్వం చాటుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు -ప్రజాప్రతినిధులు:
కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ సభ్యులు మండల సర్పంచులు కలిసి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేసీ తమ ద్రాతృత్వాన్ని చాటుకున్నారు. కాగా ఎంపీటీసీలు 11000, విద్యుత్ శాఖ ఉద్యోగులు 5000,తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది 5000, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది 5000, తొగుట ప్రెస్ క్లబ్ సభ్యులు ఐదువేల రూపాయల ఆర్థిక సాయం శ్రీనివాస్ కుటుంబానికి ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్,జిల్లా కోఆప్షన్ రహీం,సర్పంచులు పూజిత,శ్రీనివాస్, యాదగిరి, ఎంపీటీసీలు దేవేందర్,మల్లేశం, నవీన్,మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్,మండల ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|