జర్నలిస్టుల హక్కుల సాధన కోసమే డిమాండ్స్ డే

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు అయితబోయిన రాంబాబు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లవుతున్న ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగా మారిపోయాయని అన్నారు.ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ హామీ  ఇచ్చినట్లుగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ విద్యాసంస్థలలో ఉచిత ప్రవేశం కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకురావాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.ఆర్థికంగా వెనుకబడి ఉన్న జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.అర్హులైన జర్నలిస్ట్ అందరికీ తక్షణమే హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్య , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుక్క రాంబాబు , నాయిని శ్రీనివాసరావు, జిల్లా నాయకులు చలిగంటి పుల్లారావు , లింగాల సాయి ,గట్టు అశోక్ , శ్రీరామల కృష్ణ , తండు నాగేందర్ ,వెంకటేష్ , సైదులు ,దామోదర్ , నాగేశ్వరరావు , మహేష్ , సంజయ్ , నాగరాజు,సతీష్ , రామారావు , రాంబాబు , వీరస్వామి , ప్రభు , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.