జర్నలిస్ట్‌ హౌజింగ్‌పై వదంతులు సరికాదు: కాల్వ

గుంటూరు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జర్నలిస్ట్‌ ఇళ్ళ నిర్మాణంపై ఎటువంటి వందతులను నమ్మవద్దని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆంధప్రదేశ్‌ జర్నలిస్ట్‌ల ఫోరం గుంటూరు కమిటీ ఆధ్వర్యంలో హౌసింగ్‌ స్కీమ్‌పై ఉన్న సందేహాల నివృత్తి కొరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. మంత్రి కాల్వ మాట్లాడుతూ జర్నలిస్ట్‌ల హౌసింగ్‌ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని హౌసింగ్‌ స్కీమ్‌ కొరకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తామన్నారు. జర్నలిస్ట్‌ల హౌసింగ్‌ విషయమై కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అక్రెడిటేటెడ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు లందరికీ ఇళ్ళు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇళ్ళు పొందే వారి అర్హత విషయంలో మూడు సంవత్సరాలు ఉంటే ఇల్లు ఇస్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అటువంటి నిబంధన ఏవిూ లేదని ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని జర్నలిస్టులకు సూచించారు. అక్రెడిటేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని, అందులో ఎలాంటి సర్వీసు అర్హతకు సంబంధించి నిబంధనలు లేవని అన్నారు. మంత్రికివినతి పత్రం ఇచ్చిన వారిలో గుంటూరు ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్‌ ఫోర్‌ సెక్రటరీ పొత్తూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నందిగం కోటేశ్వరరావు, ఏపీజేఎఫ్‌ చిన్న పత్రికల సంఘం ప్రెసిడెంట్‌ టి.మారుతిరావు, సెక్రటరీ శివలీలయ్య, పబ్బరాజు శ్రీనివాసరావు, బ్రహ్మనాయుడు తదితరులు ఉన్నారు.

 

తాజావార్తలు