జర్మనీ సహకారంతో మంచినీటి సరఫరా

ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): జర్మనీ సాంకేతిక పరిజ్ణానంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించే కార్యక్రమం మంగళవారం పెనుమంట్ర మండలంలో ప్రారంభమైంది. పెనుమంట్ర మంచి నీటి చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎంపిపి కె.సరోజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వచ్చ ధార స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో జర్మనీ సాంకేతిక పరిజ్ణానంతో పెనుమంట్రలోని ప్రజల తాగు నీరును ఆరు నెలలకోసారి లిక్విడ్స్‌ రూపంలో శుభ్రపరుస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సాంకేతికతను నర్సాపురం, ఏలూరులో ప్రారంభించామని, ఈ రోజు పెనుమంట్రలో ప్రారంభించామని పేర్కొన్నారు.