*జాగ్రత్తలు తీసుకొని పిడుగుల బారి నుండి కాపాడుకోవాలి*
*రేగొండ తహశీల్దార్ షరీఫ్ మొహినొద్దిన్*
రేగొండ (జనం సాక్షి): తగిన జాగ్రత్తలు తీసుకొని పిడుగుల బారిన పడకుండా ఉండాలని రేగొండ తాసిల్దార్ షరీఫ్ మొహినొద్దిన్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం తహసిల్దార్ షరీఫ్ మొహియుద్దీన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వారి పిడుగులు, వాటి జాగ్రత్తలు యొక్క గోడ పత్రికను ఆవిష్కరించరు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ఉరుములు, మెరుపులు తో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, పిడుగులు పడడం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతాయని అన్నారు. పిడుగులు పడినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. వర్షం పడినప్పుడు ఉరుములు మెరుపులు సంభవించినట్లయితే రైతులు, ఎవరైనా ప్రజలు బయట అనివార్య కారణాల వల్ల ఉన్నప్పుడు ఎవరు కూడా గుంపులుగా ఉండవద్దు అని సూచించారు. ఒకరికి ఒకరికి మధ్య 100 ఫీట్ల దూరాన్ని పాటిస్తూ, మోకాళ్ళ మీద కూర్చొని తల మోకాళ్ళ మధ్యలో ఉంచి కూర్చోవాలి అన్నారు. ఎటువంటి లోహ పరికరాలను తాకవద్దు అన్నారు. ఈ గోడ పత్రికలను మండలంలోని ప్రముఖ కార్యాలయాల యందు అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలియజేశారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో గిర్ధవార్ నరేష్ ,మండల ప్రణాళిక గణాంక అధికారి మొగుళ్ళ రఘుపతి, సీనియర్ సహాయకులు స్పందన ,టైపిస్ట్ మానస, జూనియర్ సహాయకులు నిజాం, ఆఫీస్ సబార్డినేట్ స్వామి తదితరులు పాల్గొనడం జరిగింది.