జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ పై సమీక్ష

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు భువనగిరి మండల న్యాయ సేవా సమితి అధ్యక్షులు వి. బాల భాస్కర్ రావు ఈరోజు వివిధ క్రిమినల్ కేసులలో ముద్దాయిలుగా జైలులో ఉన్నవారి కేసుల పరిష్కారం మరియు వారి విడుదల అంశాలపై జిల్లా అధికారులు, భువనగిరి న్యాయమూర్తులు , న్యాయవాదులు, జైలు అధికారులు వారితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి తగిన విధి, విధానాలపై తగిన చర్యలు తీసుకోవటానికి నిర్ణయించారు మరియు వచ్చే నెల ఆగస్టు  13వ తేది రెండవ శనివారం రోజున నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ పై కూడా సమీక్ష నిర్వహించి, అధిక కేసుల పరిష్కారానికై పోలీసు అధికారులు, న్యాయవాదులు సరైన సహకారం అందించవలసిందిగా, కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను సద్వినియొగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమములో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మారుతి దేవి, సీనియర్ సివిల్ జడ్జి వి. రజని, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, యాదాద్రి భువనగిరి జిల్లా జె.సి. శ్రీనివాస్ రెడ్డి, డి.సి.పి కె. నారాయణ రెడ్డి,  భువనగిరి ఎ.సి.పి.వెంకట్ రెడ్డి, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, భువనగిరి సబ్ జైలు అధికారి పూర్ణచందర్ మరియు న్యాయవాదులు, ఎ. పి. పి. ఒ సౌజన్య మరియు ఇతర అధికారులు పాల్గోన్నారు.
Attachments area