జాతీయ స్పూర్తి ని చాటేల ముగ్గులు వేసిన రుద్రూర్ గ్రామస్తులు

రుద్రూర్ (జనంసాక్షి):
75 వ“ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు రుద్రూర్ మండల కేంద్రం తో పాటు, ఆయా గ్రామాల సర్పంచ్ లు
ముగ్గుల పోటీలు శనివారం నిర్వహించారు. మహిళలలు పాల్గొని దేశ భక్తి ని, జాతీయ స్పూర్తి ని చాటేల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో మంచి ప్రదర్శన కనబర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం రుద్రూర్ గ్రామ పంచాయతీ వద్ద, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ ఆద్వర్యంలో తెరాస మండల నాయకులు , అధికారుల తో నిర్వహించారు,
అక్బర్ నగర్ గ్రామంలో గ్రామ
సర్పంచ్ గంగామణి ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు, రాయకుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గంగారాం ఆధ్వర్యంలో 400 పైగా గ్రామస్తులతో కలిసి జాతీయ గీత అలపన చేశారు.
ఈ కార్యక్రమంలోఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పిటిసి నారోజీ గంగారం, గ్రామ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్,
ఎమ్మార్వో ముజీబ్, ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపీఓ సాయిలు, ఐకెపి ఎపిఎం భాస్కర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, గ్రామపంచాయతీ సెక్రటరీ విటల్ రెడ్డి, ఎంపిటిసి పత్తి సావిత్రి. ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు