జానపద కళా ప్రదర్శనలు
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి.
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శన కు ముఖ్య అతిథిగా మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుండి 21 వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తూ నందున జిల్లా పౌర సంబంధాల అధికారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఆలేరు పట్టణంలో జానపద కళా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, కళాకారుల బృందం , డీపీఆర్ఓ సిబ్బంది సాంబశివ, లక్ష్మణ చారి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.