జానారెడ్డికు తెలంగాణ సెగ : రిజైన్‌ చేయాలని కోమిటిరెడ్డి

నల్గోండ : పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డికి సోంత జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాందీ  95వ జన్మదినం సందర్బంగా  జానా నల్గోండలో అమె విగ్రహనికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అక్కడ అయనను పెద్ద ఎత్తున తెలంగాణ అంటూ అయనను ముందుకు కదలనివ్వలేదు. కాంగ్రెసు పార్టీకి, జానాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ కోసం జానారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని అయనను డిమాండ్‌ చేశారు. రాజీనామా చేసే వరకు ముందుకు కదలినిచ్చే ప్రసక్తి  లేదన్నారు. దీంతో ఇందిరాగాంధీ విగ్రహనికి పూలమాల వేయకుండానే జానారెడ్డి వెనుదిరిగారు. మరోవైపు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమిటీరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం గతంలో ఇచ్చిన హమీ మేరకు డిసెంబర్‌ 9వ తేదీలోగా తెలంగాణను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

లేదంటే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ గల్లంతవుతుందన్నారు. కేంద్రం తెలంగాణను ప్రకటించకుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని అయన డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 9లోగా తెలంగాణ ప్రకటన రాకుండే తాను రాజీనామా చేప్తానని చెప్పారు. అస్తుల కేసు విషయంలో వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఓ న్యాయం మంత్రి ధర్మాన ప్రసాద రావుకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

ప్రజాబలం ఉన్న నేత వైపీ నాయకులు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెసులో చేరితే అయన నాయకత్వంలో పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. కాగా అదివారం అయన సోదరుడు, ఎంపి కోమిటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా తాము జగన్‌కు అండగా ఉంటామని

హైదరాబాద్‌లో … ప్రపంచములోనే అత్యంత సమర్థవంతమైన నేత ఇందిరాగాందీ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గాంధీ భవనంలో అన్నారు. అమె ఫోటోకు పూలమాల నివాళులు అర్పించారు. పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ కూడా నివాళులు అర్పించారు. అనంతరం కిరణ్‌నెక్లెస్‌ రోడ్డులో మెగా వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌బొత్స కెవిపిలు పాల్గోన్నారు.

వరంగల్‌ జిల్లాలో ..

జిల్లాలో ఇందిర గాంధీ జయంతి వేడుకల్లో వావాధం చోటు చేసుకుంది. కార్యక్రమం సందర్బంగా రెండు వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ గండ్ర వెంకట రమణరెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యకర్తలను మంత్రి బస్వరాజు సారయ్య సముదాయించారు.