జిలిటెన్ స్టిక్స్ పేలి ఇద్దరికి గాయాలు
కరీంనగర్,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడిన సంఘటన కరీంనగర్‌లో జరిగింది. అండర్ గ్రౌడ్ డ్రైనేజి పనులు చేస్తుండగా జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ముందస్తు సమాచారం లేకుండా పేల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేస్తుండగా జిలెటిన్ స్టిక్స్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముందస్తు సమాచారం లేకుండా పేల్చడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు పనిచేస్‌ఉతన్న వారిపై ఆగ్రహం ప్రదర్శించారు.