జిల్లాలో ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

మొత్తం 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నల్లగొండ,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు..
కాపియింగ్‌కు అవకాశం లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం జీపీఎస్‌ నిఘాలో ఉంటుంది. పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్లయింగ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను నియమించామని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడిరచారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారులను నియమించా రు. అదేవిధంగా కస్టోడియన్స్‌, 2 ప్లయింగ్‌, ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించేలా సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు డీఐఈవో, జిల్లా పరీక్షల విభాగం, హైపవర్‌ కమిటీ అధికారులు సైతం ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. పరీక్ష రోజున అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది.
జిల్లాలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అవసరమైన పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.ప్రతి రోజు పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి.పరీక్ష ప్యాడ్‌, హాల్‌టికెట్‌ , పెన్నులు మినహా ఇతర వస్తువులను పరీక్ష హాళ్లోకి అనుమతించరు.