జిల్లాలో ఈ నెల 26, 27,  సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాల ఏర్పాటు

18 సంవత్సరాలు నిండిన వారు, అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే  వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి ,  ఆగస్టు 25   ::::::

ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల  26, 27, సెప్టెంబర్ 2,  3 తేదీల్లో  ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక శిబిరాల రోజులలో జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో

బూత్ స్థాయి అధికారులు

(బి ఎల్ ఓ ) సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్తగా ఓటరు నమోదుకు ఫారం -6 , సవరణలు, మార్పులు,చేర్పులకు ఫారం 8 , తొలగింపుకు ఫారం 7 ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ఆయా ఫారాలు అన్ని పోలింగ్ కేంద్రాలలో

బి ఎల్ ఓ ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది, ఏవేని

తప్పులు ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే కీలకమని గుర్తించాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు

కోవాలన్నారు.

ఓటు వేసి తమకు నచ్చిన నాయకున్నిఎన్నుకోవాలన్నారు.

జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు, మరియు అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారందరూ ప్రత్యేక శిబిరాలను వినియోగించుకొని ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్  ఆ ప్రకటనలో కోరారు.