జిల్లాలో పొగాకు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

జిల్లాలో పొగాకు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్సు హాలులో పొగాకు, బీడీ సిగరెట్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లి దండ్రులు, మన కుటుంబీకులు పొందే దుఃఖం వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అన్నారు. పొగాకు వాడడం వలన కలిగే నష్టాలను, పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్ ల గురించి అవగాహన కలిపించాలని,గుట్కా, బీడీ, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం,ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు చెడు అలవాట్ల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగరాదని, పొగాకు కు సంబంధించిన ఉత్పతులపై ప్రచారం నిషేధం అని,విద్యాలయాలకు దగ్గరలో పొగాకు సంబంధించినవి అమ్మరాదని, సేవించ రాదని, స్కూల్ కు దగ్గర ఉన్న కిరాణా, పాన్ షాపులను తనిఖీ చేయాలని, అక్కడ సిగరెట్, పొగాకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్, ఆర్డీవో చంద్ర కళ , ట్రాన్స్పోర్ట్ అధికారి పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సిద్దప్ప,రామస్వామి , సిబ్బంది , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు