జిల్లాలో మెగా జాబ్ మేళా
27 నుంచి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్
విజయనగరం,డిసెంబర్24(జనం సాక్షి): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయి శ్రీనివాస్ తెలిపారు. 1500 ఉద్యోగాల కోసం, 30కి పైగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. 2018 నుంచి 2021వరకు ఇంజినీరింగ్‌లో పాసౌట్ అయిన వారు ఈ సదావకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ అకాడవిూ, అసోసియేషన్ సంయుక్తంగా మెగా జాబ్ మేళాను నిర్వహి స్తునట్లు తెలిపారు. 2017 నుంచి 2021వరకు పాసౌట్ అయిన డిగ్రీ అభ్యర్థులు బిజినెస్ ప్రోసెసింగ్ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ,ఐఎన్‌లో ఈనెల 25లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. 27 నుంచి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు ఉంటుందన్నారు. ప్రతిభ కనబర్చినవారికి జాబ్ ఫెయిర్ కు అర్హత పొందుతారని, ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుందని తెలిపారు. మిగిలిన వారికి విశాఖలో ఎంపిక చేసిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణ అందిస్తారన్నారు. 35 రోజుల శిక్షణ అనంతరం మళ్లీ పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని వెల్లడిరచారు. జనవరి 19 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని అన్నారు.