జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సోమనబోయిన శ్రీనివాస్ కు ఘన సన్మానం
విద్యా క్షేత్రం ముందు నిరంత కృషివలుడు
డోర్నకల్ సెప్టెంబర్-10
(జనంసాక్షి న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కన్నెగుండ్ల జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు చెందిన ఇంగ్లీష్ ఉపాధ్యాయులగా విధులు నిర్వహిస్తున్న సోమనబోయిన శ్రీనివాస్ కు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్,కలెక్టర్ శశాంక,అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు,జిల్లా విద్యాధికారి అబ్దుల్ హై చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో సెంట్ ఆగ్నేస్ స్కూల్ లోని లయన్స్ క్లబ్,జడ్పీహెచ్ఎస్ కన్నెగుండ్ల గ్రామ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో సోమనబోయిన శ్రీనివాస్ కు ఘన సన్మానం చేశారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టినప్పటి నుండి ఎందరో పేద విద్యార్థికి అన్ని రకాల సాయ సహకారాలు, ఉత్తమమైన విద్య బోధనలను అందిస్తూ పలువురి మన్ననలు పొందిన సోమనబోయిన శ్రీనివాస్ కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం డోర్నకల్ మండలంలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ గర్విస్తున్నారు.లాక్ డౌన్ సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు,ప్రభుత్వం చేపట్టే హరితహారం పలు కార్యక్రమం చేయడం,అత్యంత ఉత్తమమైన బోధనాల ద్వారా విద్య క్షేత్రం నందు నిరంతర కృషివలుడు,జ్ఞాన కుసుమాల పూజించే అక్షర వనమాలి, నిస్వార్ధ నిబంధనలతో ఎందరో విద్యార్థుల మనసు గెలుచుకున్న మహోపాధ్యాయడు మన అందరి ఆత్మ మిత్రుడు టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సోమనబోయిన శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించి నందున వారికి నిర్మల హృదయ శుభకాంక్షలు తెలియజేసిన జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందని,నాకు సన్మానాలు, అభినందనలు తెలియజేసిన పలు ఉపాధ్యాయ సంఘాలకు, లయన్స్ క్లబ్ వారికి,కన్నెగుండ్ల జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులకు, గ్రామ ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.