జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడల్లో మంచి పేరు తేవాలి…
– తహాసిల్దార్ జాకీర్ అలీ.
ఊరుకొండ, ఆగస్టు 14 (జనం సాక్షి):
భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఊర్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలలో చక్కని ప్రతిభ కనబరిచి, ఈ నెల 18న జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికైన వాలీబాల్ క్రీడాకారులు జిల్లా స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని తహాసిల్దార్ జాకీర్ అలీ కోరారు. ఆదివారం ఊరుకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన వాలీబాల్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని, జిల్లాస్థాయి పోటీలలో చాకచక్యంగా వ్యవహరించి ఊరుకొండ మండలానికి మంచి గుర్తింపు తేవాలని పిలుపునిచ్చారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని వాలీబాల్ క్రీడలు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజయ్య, తహాసిల్దార్ జాకీర్ అలి, ఎంపీడీవో ప్రభాకర్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎస్సై లక్ష్మణ్ నాయక్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ యాదయ్య గౌడ్, ప్రధానోపాధ్యాయులు బాలయ్య, సెక్రటరీ వెంకటయ్య, ఉప సర్పంచ్ నారాయణ, యువ నాయకులు సందీప్ కుమార్, కొమ్ము శీను, గోపి, హకీమ్, వాలీబాల్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.