జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు సంఘం
అధ్యక్షుడిగా హనుమంతు గణేష్ ముదిరాజ్
నర్సాపూర్. సెప్టెంబర్, 19, ( జనం సాక్షి )
మెదక్ జిల్లా ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా నర్సాపూర్ పట్టణానికి చెందిన హనుమంతు గణేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా టేక్మాల్ మండలానికి చెందిన నర్సింలు ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం లో గణేష్ ముదిరాజ్, నర్సింలు ముదిరాజ్ కను జిల్లా అధ్యక్ష కార్యదర్శులగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర హడ్ హాక్ కమిటీ అధ్యక్షుడు నీలకంఠ ముదిరాజ్ తెలిపారు.
సోమవారం నాడు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ముదిరాజ్ కులస్తులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అతిపెద్ద జనాభా 40 లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాలలో రాణించాలని వారు కోరారు.
ప్రతి ఒక్కరు తమ పిల్లలను కష్టపడి ఉన్నత విద్యను చదివించేందుకు కృషి చేయాలని కోరారు.
ముదిరాజ్ కులస్తులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల నిర్మాణం కోసం డబ్బులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లాలో ముదిరాజ్ జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడంతో పాటు వారి అభివృద్ధికి పాటుపడతానని ఆయన పేర్కొన్నారు.
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 1 జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గణేష్ ముదిరాజ్ ను అభినందిస్తున్న జర్నలిస్టులు
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 2 ముదిరాజ్ జర్నలిస్టు సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన గణేష్ నర్సింలు