జిల్లా రైతుబంధు డైరెక్టర్ కంచర్ల వీరారెడ్డి ని పరామర్శించిన – కందాళ.

కూసుమంచి ఆగస్టు 21 ( జనం సాక్షి ) :  కూసుమంచి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కంచర్ల పద్మ భర్త ప్రస్తుత జిల్లా రైతుబంధు డైరెక్టర్ మాజీ నాయకన్ గూడెం సర్పంచ్ మండల తెరాస నాయకులు కంచర్ల వీరారెడ్డి ఇటీవల ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ అదుపుతప్పి క్రింద పడడంతో అతనికి కాలు విరిగినది. హైదరాబాదులోని ప్రముఖ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని ఇటీవల నాయకన్ గూడెం  వచ్చిన  వీరారెడ్డి ని ఆదివారం రోజున అతని ఇంటి వద్ద పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట డిసిసిబి డైరెక్టర్  ఇంటూరి శేఖర్, మండల పరిషత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కాసాని సైదులు, ఉప సర్పంచ్ కిన్నెర శ్రీకాంత్, కొండపల్లి మండల తెరాస అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, నాయకన్ గూడెం   మాజీ మండల పరిషత్ సభ్యులు  ప్రస్తుత తెరాస నాయకన్ గూడెం అధ్యక్షుడు జహంగీర్ షరీఫ్, నాయకన్ గూడెం మాజీ ఉపసర్పంచ్ కంది బండ జయప్రకాష్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.