ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
ములుగు (జనం సాక్షి) :
నిన్న జరిగిన కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఈరోజు ములుగు జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ఆసుపత్రి సూపర్డెంట్ మరియు జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ కలిసి టీ హబ్ కు కావలసిన రెండవ వాహనము గురించి మరియు ఆశలకు రాత్రి వేళలో ఉండేందుకు వసతి రూమ్ గూర్చి చర్చించడం జరిగింది. తరువాత జ్వరాల కేసులను ప్రతిరోజు సాయంత్రము ఏ ఏ రియాస్ నుండి వచ్చినటువంటి వాటి వివరములను తెలియపరచాలని కోరారు.
ఈ యొక్క వివరాలను ఐడిఎస్పి మానిటరింగ్ సూపర్వైజర్ సిహెచ్ఓ దుర్గారావు గారికి 9 3 4 6 4 4 2 5 2 9 కి అందించాలని తెలిపారు. అనంతరము ప్రధాన ఆసుపత్రిలోని లేబర్ రూమ్, ఐసీయూ, గర్భిణీ స్త్రీలను అవుట్ పేషంట్ పరీక్షించు గదిని, సాధారణ పేషంట్లను పరీక్షించు గదులను తనిఖీ చేసి తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వార్డులో ఉన్న వైద్య సిబ్బందికి డాక్టర్లకు నాణ్యమైన వైద్య సదుపాయం ప్రజలకు అందించాలని కోరారు.