జీఎస్టీ అధిక ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి ): జిఎస్టి అధిక ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ (ప్రజాపంథా ) ప్రజలకు పిలుపునిచ్చారు . టేకులపల్లి మండలంలోని ఆంజనేయపాలెంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షుడు డి ప్రసాద్ స్వగృహంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాజీ ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు అధాయాలు లేక, అధిక ధరలతో నా నా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ,కార్పొరేట్ అనుకూల విధానాలు, అందుకు ప్రధాన కారణాలు. కనుక పెరిగే ధరలను నియంత్రించాలని, జీఎస్టీని ఉపాసహరించాలి అని,పేదలకు చౌక ధరలకు నిత్యవసరాలు అందించాలని డిమాండ్ చేస్తూ ,ఆగస్టు 29న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర ప్లీనరీ పిలుపునిచ్చింది .అందులో భాగంగా కొత్తగూడెంలో ఆగస్టు 29న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. ఈ సమావేశంలో చండ్ర అరుణ, ముద్ది బిక్షం, అమర్లపూడి రాము, సూప భాస్కర్, మాచర్ల సత్యం ,బుర్ర వెంకన్న ,మధుసూదన్ రెడ్డి ,కల్లయ్య,కిషోర్ ,రామారావు ,లక్ష్మణ్, సత్యనారాయణ ,బోసు, జాటోత్ కృష్ణ, గౌస్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.