జీడిపిక్కల కార్మికులను ఆదుకోవాలి
విశాఖపట్టణం,ఆగస్ట్30(జనం సాక్షి): రాష్ట్రంలో జీడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు అన్నారు. జీడి పిక్కల కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం జీడి పిక్కల కార్మికులకు కనీస వేతనాలు తదితర అన్నింటినీ చట్టపరిధిలో అమలు చేయాలన్నారు. ఈ కార్మికుల శ్రమను కారు చౌకగా దోపిడీ చేస్తున్నారన్నారు. నర్సీపట్నం ప్రాంతంలో కార్మికులు వేధింపులకు కూడా గురవుతున్నారన్నారు. కేరళ తరహాలో కూలీ చెల్లించాలన్నారు. అక్కడ గ్రాట్యుటీ, ఈఎస్‌ఐ తదితర అన్ని సదుపాయాలను పక్కాగా అమలు చేస్తున్నారన్నారు. ఈ విధంగానే ఆంధ్రలో కూడా అన్నీ అమలయ్యేలా ఇక్కడి ప్రభుత్వం చర్యలుతీసుకోవాలన్నారు. కేరళలో ఈ పరిశ్రమకు చెందిన 10 లక్షల మంది కార్మికులు ఉన్నారన్నారు. వారికి అక్కడి ప్రభుత్వం అండగా నిలిచి అన్ని సౌకర్యాలను అమలు చేస్తోందన్నారు. ఇక్కడా అలాగే అమలు చేయాలన్నారు.