జీవాలకు ముందస్తుగా నట్టల మందు వేయించుకోవాలి         

                      తూప్రాన్ (జనంసాక్షి) జూన్ 10:: వచ్చే వర్షాకాలం సీజన్ కు ముందుగా గొర్రెలు మేకల యజమానులు తప్పనిసరిగా తమ జీవాలకు నట్టల నివారణ మందులు వేయించుకోవాలని మెదక్ జిల్లా చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మండల కేంద్రమైన మనోహరాబాద్ లో మేకలకు నట్టల మందు వేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు నట్టల మందులు వేయడానికి ప్రతి గ్రామం లో ప్రత్యేక క్యాంపు నిర్వహించి నట్టల మందు వేస్తున్నట్లు పశువైద్యాధికారి లక్ష్మి తెలిపారు  మండలం లోని గౌతోజి గూడెం గ్రామానికి చెందిన రైతు పర్షబోయిన దుర్గమ్మ గత రెండు నెలల క్రితం చనిపోయినందున  ఐదు లక్షల రూపాయల రైతు భీమా ఉత్తర్వుల కాపి నీ బాధిత కుటుంభానికి ఆమె అందజేశారు.ఈ కార్యక్రమంలో వెటరనరీ డాక్టర్ లక్ష్మీ  పిఎసిఎస్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్పంచ్ మహిపాల్ రెడ్డి గౌతు జి గూడా సర్పంచ్ వెంకటేశ్వర్లు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేణు కుమార్  ఆత్మ కమిటీ సభ్యులు బిక్షపతి మాజి యంపీటీసీ బాబు ,టిఆర్ఎస్ నాయకులు రమేష్  బాలేష్  శైలెందర్  వెంకటేశ్వర్లు  జావేద్  తదితరులు పాల్గొన్నారు అనంతరం రామయపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం లో పాల్గొన్నారు గ్రామంలో గురువారం రోజు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ ఆకస్మిక తనకి చేయగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదని పాల్గొని ప్రజాప్రతినిధులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఎంపీడీవో ఆదేశించారు శుక్రవారం రోజు జడ్పీ చైర్పర్సన్ అధికారులతో గ్రామంలో ఆమె పర్యటించి పల్లె ప్రగతి లో పరిసరాల పరిశుభ్రత పిచ్చి మొక్కల ను తొలగించడం నీరు నిల్వ ఉంటే గుంతలను పుట్టడం హరిత హారంలో మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించడం గతంలో నాటిన మొక్కలను ఏ విధంగా సంరక్షించాలి ఆమె సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణమూర్తి స్పెషలాఫీసర్ కృష్ణమూర్తి సర్పంచ్  తదితరులు పాల్గొన్నారు