జీవో నెం.151 ప్రకారం వేతనాలు చెల్లించాలి

– నందిగామ మున్సిపల్‌ ఎదుట కార్మికుల ర్యాలీ
విజయవాడ, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు శనివారం నందిగామ మున్సిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. నందిగామ మున్సిపల్‌ కార్యాలయం నుండి బయలుదేరి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీ రామకృష్ణ కు వినతిపత్రం అందించారు. మున్సిపల్‌ కార్మికుల ప్రధాన డిమాండ్‌ లైన ఐదో తారీకు వేతనాలు జమకావడం లేదని, బట్టలు ,బ్లౌజులు, బూట్లు, ఇవ్వడం లేదని, జీవో నెంబరు 151 ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఎంఆర్‌ఒ కు వివరించారు. వెంటనే తహసీల్దార్‌ కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో సంప్రదించి తక్షణం వారికి ఇవ్వవలసిన జీతాలు, బూట్లు, బ్లౌజులు అందించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గంలో చర్చలు ఫలించకపోతే ఆరో తారీకు నుండి సమ్మె చేస్తామని కార్మికులు చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కటారపు గోపాల్‌, మున్సిపల్‌ నాయకులు నరేష్‌, మాణిక్యం, సైదా, శీను, కోటయ్య, బేబి, గురవయ్య  పాల్గొన్నారు.

తాజావార్తలు