జీవ ఎరువులతో రైతులకు అధిక లాభాలు

జీవ ఎరువులతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చునని మండల వ్యవసాయ విస్తరణ అధికారి మజీద్ అన్నారు. మండల పరిధిలోని బిజిలిపూర్ గ్రామంలో గురువారం వానాకాలం పంటల సాగు విధానం పై రైతులకు ఆయన సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సమావేశం లో మండల వ్యవసాయ విస్తరణ అధికారి మాజిద్ మాట్లాడుతూ రైతులు వరి వెదజల్లే పద్ధతి, జీవన ఎరువుల వాడకం, దఫా దఫాలుగా యూరియా వినియోగం, పచ్చిరొట్టెల వాడకం గురించి సూచనలు చేశారు. అలాగే రైతులు విత్తులు నాటే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి దీని కోసం ముందుగా జీవన ఎరువుల వంటి పియస్ బి (PSB) ఒక ఎకరానికి 200గ్రా. ఎరువు సమ మోతాదులో 10 శాతం చెక్కర లేదా బెల్లం ద్రావణాన్ని కలిపి విత్తనం చుట్టూ సమానంగా పట్టించి, 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలని ఏఈఓ రైతులకు నేరుగా ప్రదర్శన చేసి చూయించారు. జీవన ఎరువులు వాడడం వల్ల రైతులకు అధిక ఖర్చు తగ్గి అధిక లాభాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మీ పొచయ్య, రైతులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.