జీ.ఓ 252పై త్వరలో జర్నలిస్టు సంఘాలతో సమావేశమవుతాం
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):జర్నలిస్టులను విభజించి పాలించాలానే ఆలోచనతో, అక్రెడిటేషన్స్ లో కోత పెడుతూ తీసుకు వచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గురువారం సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన నేతలతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కొత్త జీ.ఓ పై అన్ని జర్నలిస్టు సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, కోశాధికారి పి.యోగనంద్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర్ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్. కోశాధికారి బాపు రావు, దెయ్యాల అశోక్ లు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిఅక్రెడిటేషన్స్ లో కోత పెడుతూ తీసుకు వచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని కోరుతూ, అసెంబ్లీలో చర్చించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గురువారం నాడు మినిటర్స్ క్వార్టర్స్ లో రవాణా, బీ.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, కోశాధికారి పి.యోగనంద్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర్ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్.

