‘జుకర్ బర్గ్, జాక్లను చంపేస్తాం’!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కన్ను ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ లపై పడింది. ఈ రెండు సంస్థల బాస్ లను త్వరలో హత్య చేస్తామంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జుకర్ బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేల ఫొటోలపై బుల్లెట్లతో దాడి చేస్తున్నట్లు ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సోషల్ మీడియా సంస్థలు ఉగ్రవాద భావజాలానికి సంబంధించిన అంశాలను నిరోధించడంతో వారిని టార్గెట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఐసిస్. సన్స్ ఆఫ్ ఖలీపత్ ఆర్మీ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో పలు హెచ్చరికలు కూడా చేసింది. తాము ఇప్పటి వరకు 10 వేల ఫేస్ బుక్ ఖాతాలు, 150 ఫేస్ బుక్ గ్రూప్స్ ను హ్యాక్ చేసినట్లు చెప్పింది. 5 వేల ట్విట్టర్ ఖాతాలను కూడా దొంగిలించినట్లు ప్రకటించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తన చర్యలు ఆపేయకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఐసిస్.