జూన్ 6న ఉద్యోగ మేళా

సంగారెడ్డి టౌన్ జనంసాక్షి
ఈనెల 21న  జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన  శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
  శ్రీ గాయత్రి ఎంటర్ప్రైజెస్ కంపెనీలో 300 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
  ఐటిఐ ఏదేని ట్రేడ్ లో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.
ఆసక్తి ,అర్హత గల  అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు , పాన్ కార్డు,బ్యాంక్ పాస్ బుక్,  పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో ఈ నెల 21న  ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బైపాస్ రోడ్ లో గల పాత డిఆర్డిఏ (వెలుగు ఆఫీస్) కార్యాలయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంనకు నేరుగా  హాజరుకావాలని ఆమె సూచించారు.
ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.