జోగంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో పేలుడు
వరంగల్: శాయంపేట మండలం జోగంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించటంతో సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. పేలుడు సంభవించటం వలన దేవాదుల ఉత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు అధికారులు.