జోడో యాత్రకు పటిష్ట భద్రత

అల్లాదుర్గం జనంసాక్షి
కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీన ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దపూర్ లో ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర నేపథ్యంలో జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మంగళవారం రూట్ మ్యాపు పరిశీలించి రాహుల్ గాంధీ నిర్వహించే సభా స్థలాన్ని, ఆయన బస చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను అల్లాదుర్గం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం పోలీస్ సర్కిల్ లో జరగనున్న ఈ భారత్ జొడో యాత్రలో తీసుకోవలసిన జాగ్రతల ను ఆమె అల్లాదుర్గం సీఐ జార్జి, ఎస్ బి సీఐ నవీన్ బాబు, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, బాలరాజు, సత్యనారయణ లకు పలు సూచనలు , సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బసన్నగారి బలరాం, యూత్ కాంగ్రెస్ నాయకులు కుర్మ మహేష్, తదితరులు న్నారు