జోరు వానలు…
జులై 11జనం సాక్షి/తెలంగాణలో నైరుతి రుతుపవనాలు,ఉపరితల ద్రోని ప్రభావం వలన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.మండలంలో భారీ వర్షపాతం నమోదు కాగా సోమవారం రోజున కేసముద్రం పట్టణంలో జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి మరియు ఎంపీడీవో రోజా రాణి,ఎస్సై రమేష్ బాబు,మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,ఎంపీ ఓ రఘుపతి రెడ్డి,గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి వర్షం తాకిడికి తట్టుకోలేని కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను సందర్శించి వారిని షిఫ్ట్ చేయడం జరిగింది.అనంతరం మండలంలోని అర్పనపల్లి గ్రామ వట్టి వాగు ఉధృతిని,ఉప్పరపల్లి గ్రామంలో వానల తాకిడికి కూలిన ఇళ్లను ఎంపీడీవో,ఎస్సై,అర్పనపల్లి సర్పంచ్ గంధసిరి స్వరూప సోమన్న లు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే గాని బయటకు రాకూడదని,ప్రయాణాలు రద్దు చేసుకోవాలని, ప్రవహిస్తున్న వాగులు వంకలను దాటకూడదని,విద్యుత్ స్తంభాలను,రైతులు విద్యుత్ మోటార్లను తాకరాదని పలు సూచనలు చేశారు.