టర్కీలో ఉగ్రదాడి: 30మంది మృతి
ఉగ్రదాడులతో టర్కీ వణికిపోతోంది. శనివారం రాత్రి ఓ వివాహ వేడుకపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 94 మంది గాయపడ్డారు. సిరియా సరిహద్దు ప్రాంతంలోని టర్కిష్ పట్టణంలో ఉన్న గజియాన్ టెప్ లో ఓ వివాహ వేడుక జరుగుతుండగా.. బాంబులు అమర్చుకుని వేడుకలోకి వచ్చిన ఉగ్రవాది తనకుతాను పేల్చుకుని మారణహోమం సృష్టించాడు. దీంతో టర్కీ సరిహద్దు ప్రాంతాలను మూసివేసిన అధికారులు, హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతున్నది. ఐసిస్ ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.