టాంజానియాతో భారత సంబంధాలు భేష్‌

C

– 17 నగరాలు మధ్య వాటర్‌ ప్రాజెక్టులు

– భారత ప్రధాని నరేంద్ర మోదీ

టాంజానియా,జులై 10(జనంసాక్షి):భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ టాంజానియాలో పర్యటించారు. 19వ శతాబ్ధం నుంచి టాంజానియాతో భారత్‌ కు వ్యాపార సంబంధాలున్నాయన్నారు మోడీ. టాంజానియాలో అధ్యక్షుడు జాన్‌ మాగుఫులితో కలిసి జాయింట్‌ స్టేట్‌ మెంట్‌ రిలీజ్‌ చేశారు. టాంజానియా అభివృద్ధి కోసం అధ్యక్షుడు జాన్‌ మాగుఫులి చేస్తున్న కృషిని అభినందించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తామన్నారు. 17 నగరాల మధ్య వాటర్‌ ప్రాజెక్టుల కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు మోడీ.టాంజానియాలో మరోసారి డప్పులు వాయించారు మోడీ.  ఆ దేశ అధ్యక్షుడు జాన్‌ పొంబె జొసెఫ్‌ మగుఫులి, నరేంద్ర మోడీ కలిసి సరదాగా స్టేట్‌ హౌస్‌ లో ఆ దేశ సంప్రదాయ డ్రమ్స్‌ వాయించారు. వాళ్లిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధమైన అంశాలు చర్చకు వచ్చినట్టు ఫారన్‌ సెక్రటరీ వికాస్‌ స్వరూప్‌ వెల్లడించారు. అక్కడి భారతీయులను కలశారు మోడీ.

ప్రపంచమంతా ఒకే కుటుంబం: మోదీ

నైరోబీ: ప్రపంచమంతా ఒకే కుటుంబం వంటిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా కెన్యాలోని నైరోబీ నగరంలో నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. దశాబ్దాల కిందటే భారతీయులు ఇక్కడికి కూలీలుగా వచ్చారని ప్రధాని అన్నారు. వారు అంతా ఇక్కడి స్థిరపడిపోయారని.. చాలా మంది భారత్‌ తిరిగి రాలేదన్నారు. ఇక్కడి నుంచి వచ్చిన భారతీయులు మాత్రం ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పేవారన్నారు. మంచిచెడుల్లో పరస్పరం సహకరించుకోవాలన్నారు. భారత్‌ – ఆఫ్రికా బంధాన్ని బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.