టాటాకు 2వేల కోట్ల విలువైన భూమి ఎలా ఇస్తారు?

తిరుపతి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టిటిడికి చెందిన 2వేల కోట్ల విలువైన స్థలాన్ని టాటా గ్రూపుకు కట్టబెట్టడాన్నిమాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ తప్పుపట్టారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. టిటిడి యాజమాన్యం విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తుందని విమర్శించారు. రెండు వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన 25 ఎకరాల స్థలాన్ని టిటిడి, టాటాకు కేటాయించడం శోచనీయమన్నారు. తిరుపతిలోని టిటిడి సత్రాల్లో రాసలీలలు జరుగుతున్నాయని, వాటిపైన చర్యలు తీసుకునే నాధుడే లేడని తెలిపారు. టాటా కేన్సర్‌ ఆసుపత్రికి రెండున్నర ఎకరాల స్థలం సరిపోతుందని, ఎవర్ని మెప్పించేందుకు ఇంత స్థలాన్ని ఇచ్చారని ప్రశ్నించారు.

తాజావార్తలు