టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో పరాజయంపాలైన భారత్‌ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ గెలవడం తప్పనిసరి.భారత్‌-ఆస్ట్రేలియా మూడో వన్డేలో 15 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ 6 పరుగులు చేసి రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రసుత్తం శిఖర్‌ధావన్‌, విరాట్‌ కోహ్లీ క్రీజులో ఉన్నారు.  దీంతో వన్డేలో కూడా బ్యాట్స్‌మెన్‌పైనే భారం పడింది.