టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
విశాఖ: ఐపీఎల్ -8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఇప్పటికే రాజస్థాన్ వరుస మూడు విజయాలను కైవశం చేసుకుని దూసుకుపోతుండగా, సన్ రైజర్స్ ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. మరి ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను సన్ రైజర్స్ నిలువరిస్తుందా? లేదా అనేది చూడాల్సిందే.