టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
రాంచీ: ఇండియా టూర్‌లో మొత్తానికి న్యూజిలాండ్ ఓ టాస్ గెలిచింది. రాంచీలో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కివీస్ కెప్టెన్ విలియమ్సన్. ఇప్పటివరకు టెస్ట్ సిరీస్‌లో 3, వన్డే సిరీస్‌లో మూడుసార్లు టాస్ గెలవలేకపోయింది న్యూజిలాండ్. కివీస్ టీమ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. మరోవైపు టీమిండియాలో బుమ్రా ఫిట్‌గా లేకపోవడంతో ధవల్ కులకర్ణి టీమ్‌లోకి వచ్చాడు.