టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సురేందర్ రెడ్డి రాజీనామా
భీమదేవరపల్లి మండలం ఆగస్టు (19) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ఎస్ ఆర్ కె స్కూల్లో శుక్రవారం రోజున వృక్ష ప్రసాద దాత జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆశయాలు ఆయన నీళ్లు నిధులు అనేక నియమాయక నియమకాలు వస్తాయని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గత ఎన్నికల్లో టిఆర్ఎస్ వైపు ప్రజలు ముగ్గు చూపారని అయితే ప్రజలు ఆశయాలు వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 8 సంవత్సరాలలో కనీసం సచివాలయానికి వెళ్లకుండా దొరల పాలన సాగిస్తున్నారని మిగిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు వారికి వంత పాడుతున్నారని విమర్శించారు హుజురాబాద్ సింగాపురం నుండి వచ్చిన స్థానికుడైన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు ఈ ప్రాంతానికి సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారని ఎమ్మెల్యే చేతగానితనం అసమర్థత వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు ఈ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న సిద్దిపేట టు హుజురాబాద్ నియోజకవర్గాలు ఎంతో అభివృద్ధి చిందేయని ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే చేతకానితనం అసమర్థత కాదని అన్నాడు 2014 నుండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమంలో తను చురుగ్గా పాల్గొన్న ఏనాడు పదవులను ఆశించలేదని కానీ 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల న్యాయము జరుగుతుందని శాశ్వత సమస్యలు పరిష్కారమై ప్రజలు సంతోషంగా ఉంటారని భావించామని కానీ దానికి భిన్నంగా కేవలం ప్రజాప్రతినిధులు వారి అనుచరులు మాత్రమే బాగుపడ్డారని దీనివల్ల సామాన్యులకు ఒరిగేదింమీ లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు మరియు వారి అడుగులకు మడుగులెత్తి వాళ్లు మాత్రమే రాజకీయంగా పొందారని ఉద్యమకారులకు ఇంటి వల్లనే టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఇక ఈ నెల 21 మునుగోడు లో జరిగే బిజెపి బహిరంగ సభలో బిజెపిలో చేరినట్లు తెలిపారు