టిఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

గాదరి కిషోర్‌ సమక్షంలో చేరికలు

నల్లగొండ,ఆగస్ట్‌3(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకులపాడ్‌, శాలిగౌరారం గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఉంటుందన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేసారు. అనంతరం దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని లబ్దిదారుడికి అందజేశారు.

తాజావార్తలు