టిటిడి ఎక్స్‌అఫీషియోగా కమిషనర్ ప్రమాణం
తిరుపతి,ఆగస్ట్28(జనం సాక్షి): రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా.ఎం.పద్మ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ డా. ఎం.పద్మతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు. కార్యక్రమంలో టిటిడి బోర్డు సెల్ డిప్యూటీ ఈవో సి.మల్లీశ్వరిదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే అన్నమయ్య భవన్‌లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమయింది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు బ్ర¬్మత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకూ శ్రీవారి వార్షిక బ్ర¬్మత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్ర¬్మత్సవాలు నిర్వహిస్తున్నట్లు బోర్డు సభ్యులు తెలిపారు. అలాగే అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, రూ.150 కోట్లు ఆలయ నిర్మాణానికి కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకోనుంది.