టిటిడి బోర్డు కీలక నిర్ణయాలు

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపునకు ఆమోదం
తిరుమల,నవంబర్‌27(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం సమావేశమైన టిటిడి బోర్డు పలు అంశాలను చర్చించింది. ఈ సందర్భంగా  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంపై నిర్ణయం తీసుకుంది. అలాగే చిత్తూరు జిల్లా నారాయణ వనంలో రూ. 2.5 కోట్లతో అవణాక్షమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది.  రూ. 3.77 కోట్లతో శ్రీవారి పుష్కరిణి చుట్టూ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలన ఇనిర్ణయించారు.  రూ. 21.7 కోట్లతో ఆధునాతన బూందిపోటు నిర్మాణం, రూ. 28 లక్షలతో గంగమ్మగుడి ఆలయం వద్ద ఆర్చ్‌ నిర్మాణం, అవిలాల చెరువు అభివృద్ధికి రూ. 42.7 కోట్లు కేటాయింపు,  రూ. 4.19 కోట్లతో భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్‌ పు/-టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిటిడి ఇవో అవోక్‌ కుమార్‌ సింఘాల్‌ తదితరులు పాల్గొన్నారు.