టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా పరుశురాంరెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా బద్దం పరుశురాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరుశురాంరెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తనకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పడించినందుకు పరుశురాంరెడ్డి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీకి నిస్వార్థంగా సేవలందిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.