ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి:టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్
కరీంనగర్ నవంబర్ 23 జనంసాక్షి : తేది 23-11-2012నస్థానిక ఐఎంఏ భవనంలో జిల్లా టీఎన్జీవోల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశకు టీఎన్జీవో ల జిల్లా అద్యక్షుడు యంఏ హమీద్ టీఎన్జీవోల కేంద్ర సంఘం లధ్యక్షుడు జి.దేవీ ప్రసాద్ రావు ముఖ్య అతిధి గా పాల్గోన్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల పి.ఆర్‌సీ హెల్త్ కార్డులు రాబోవు రోజులలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర గురించి చర్చ జరిగింది అలాగే ఈ సమావేశంలో సంఘానికి సంభందించిన కొన్ని తీర్మానాలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగుల మానస పుత్రిక ఐన ‘ఉద్యోగుల గోంతిక’ మాస పత్రిక కు జిల్లా లో చేస్తున్న ఉద్యోగులందరిని శాశ్వత సభ్యులు గా చేర్పించటం,ఉద్యోగుల బహుళ ప్రయోజనం కొరకు ప్రతి సంవత్సరం లాగే 2013వ సంవత్సర డైరీని విడులద చేయడం, ఉద్యోగంలో ఉండి అకస్మాత్తుగా చనిపోయిన వారి కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం రూ.2500నుండిరూ.5000లకు పెంచడం లాంటి తీర్మానాలు చేయడం జరిగింది. అలాగే కరీంనగర్,మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబందించిన కరీంనగర్ పట్ట బద్రుల నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టి , తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల ఉనికి ప్రపంచానికి చాటి చెప్పిన టీఎన్జీవో మాజీ లద్యక్షుడు కే. స్వామి గౌడ్ అభ్యర్థిత్వన్ని బల పర్చలని దాని వల్ల ఉద్యోగుల సమస్యలను నేరు గా ప్రబుత్వంతో చర్చించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ.హమీద్ నరసింహ స్వామిలు పేర్కోన్నారు. అదే విదంగా వేములవాడ , మహదేవ్ పూర్ మండలాలలో సంఘ భవనాలు నిర్మించుకొనుటకు సంభదిత స్థలాల విషయంలో ప్రబుత్వంనుండి త్వరగా అనుమతులు పొందడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ నెల 19న హైదరాబాద్ లో జరిగే ఉద్యోగుల మహ ధర్నా కు జిల్లానుండి అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గోనాలని కోరారు.ఈ కార్యక్రమం ముందు కేంద్ర సంఘం అద్య్ష కార్య దర్శులు జి.దేవి ప్రసాద్ రావు,కారం రవిందర్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని పీఆర్‌సీ తొందరగా ప్రకటించి 2013జులై నుండి అమలు చేసేట్లు గా ప్రబుత్వం చేయాలని పత్రిక మీడియా ప్రతినిదులతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలియ .ఏశారు. టీఎన్జీవో మహిళా కార్యవర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా అద్యక్ష కార్యదర్శులతో పాటు కేంద్ర సంఘం ఉపాద్యాక్షురాలు కుమారి రేచల్ ,సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కే.రంగరాజు, హైదరాబాదు జిల్లా అధ్యక్షులు ఎస్‌ఎం హుస్సేన్, కార్యదర్శి కే. వెంకటేశ్వర్లు , వరంగల్ జిల్లా కార్యదర్శి కే.రత్నవి చారి, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల అధ్యక్షుడు జి.జానేశ్వర్ ,తెలంగాణ సబ్ రిజిస్టార్ ల అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస రావు, ట్రెస్సా కార్యదర్శి మస్లియోద్దిన్ ,రాష్ట్రా ఉపాద్యక్షులు శ్రీహరి రెడ్డి , కేశవరెడ్డి , జిల్లా కార్యవర్గం సుద్దాల రాజయ్య గౌడ్ , ఎస్ అక్ష్మన్‌రావు, వి.మాదవయ్య, ఎస్.లక్ష్మీ ,జే.ఆనందరావు, జి. శంకర్ ప్రసాద్ , బి.శ్రీనివాస్,స్వర్ణ లత ,ప్రబాకర్ రెడ్డి , పట్టణ కార్యవర్గం వేముల రవిందర్, దారం శ్రీనివాస్ రెడ్డి , శంకర్,సుదీర్, సురేష్ బాబు , కాళి చరణ్ , హర్మిందర్ సింగ్ , రాజేశ్ , తాలుక స్పెషల్ యూనిట్ల అధ్యఓ కార్యదర్శులు టి. శ్యాం సుందర్ రమేశ్ ,రాఘవ రెడ్డి ,రాజనరేందర్ రావు, అఫ్జల్ , మన్మంత రావు, మల్లా రెడ్డి , సైదులు జగన్, కిషన్, లక్ష్మారెడ్డి , రవిందర్ , రాజేశ్వర్, బిక్షపతి, మహిళా నాయకురాళ్లు పద్మలత , జ్యోతి, బిందు, కరుకదుర్గ , రుక్సానా, జిల్లా నాలుగో తరగతి అధ్యక్ష కార్యదర్శులు నర్సయ్య వెంకటయ్య , గోపాల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.