టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి)

 

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని, వారి విగ్రహమునకు పూలమాలవేసిన టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పర పీడన పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య పోరు సాగుతున్న రోజులు ఓవైపు, నిజం నవాబు పాలనలో బాధలు భరించలేక నిజాం రజాకార్లనుతుదముట్టించేందుకు మహోజ్వలగా సాయిధ పోరాటం మరోవైపు, రెండు ఒకే కోవకు చెందినవే, అలాంటి సమయంలో తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్ని కణమే వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీరవనితఐలమ్మ.వ్యవసాయక విప్లవం రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ. స్త్రీ జాతికి ఆదర్శనీయం ఆమె జీవితం, మహిళా లోకానికి మార్గదర్శకం ఆమె పోరాట స్ఫూర్తని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వరంగల్ టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి గాదే వేణుగోపాల్, స్థానిక కార్పొరేటర్ విక్టర్ అరుణ జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, జిల్లా నాయకులు తోటచందర్రావు,నాగేశ్వరరావు,శ్రీనివాస్, శేంకేశి రాజేష్, మరియు నల్లతిగల కోటేశ్వర ,మల్లేశం, సంఘ నాయకులు పాల్గొన్నారు.