టీఎస్పీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

-కలెక్టర్ శశంక

మహాబూబాబాద్-సెప్టెంబర్ 9:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖాధికారులు, ప్రైవేటు విద్యా సంస్థల భాద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీఎస్పీఎస్సీ పరిక్షల నిర్వహణకు గాను 31 పరిక్షా కేంద్రాలను గుర్తించడం జరిగిందని వీటిలో 11 ప్రభుత్వ విద్యాసంస్థలు కాగా 20 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని జిల్లాలో సుమారు 7806 మంది టీఎస్పీఎస్సీ పరిక్షలకు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. అన్ని పరిక్షా కేంద్రాలలో కనీస వసతులైన త్రాగు నీరు, టాయిలెట్స్, సరిపడా ఫర్నీచర్, సిసి టీవి కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ విద్యాసంస్థల మేనేజ్మెంట్ గుర్తించిన పరిక్షా కేంద్రాలలో తప్పనిసరిగా కనీస మౌళిక వసతులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి తో పాటు ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి బృందాలను ఏర్పాటు చేసి గుర్తించిన పరిక్షా కేంద్రాలను తనిఖీ చేసి అవసరమైన అన్ని ఏర్పాట్లతో టీఎస్పీఎస్సి పరిక్షల నిర్వహణకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ హై, జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి సత్యనారాయణ, తొర్రూరు, మహబూబాబాద్ ఆర్డీఓ లు కొమురయ్య, రమేష్, ఆయా పాఠశాలల , కలాశాలాల ప్రాదానోపాద్యాయులు, ప్రిన్సిపాల్స్, ప్రైవేటు పాఠశాలల భాద్యులు, తదితరులు పాల్గొన్నారు.