టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గం మహాసభను జయప్రదం చేయండి.
చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 20) మండల కేంద్రమైన చండ్రుగొండలో ఆదివారం ఉదయం జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) అశ్వారావుపేట నియోజకవర్గ మొదటి మహాసభను జయప్రదం చేయాలని చుండ్రుగొండ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామిశెట్టి సైదయ్య పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ భాస్కర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అవుతుందన్నారు. అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి దమ్మపేట అశ్వారావుపేట మండలాల నుంచి వచ్చే పాత్రికేయ మిత్రులు సకాలంలో హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కర్ర అనిల్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు సూరిబాబు,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొంటారని తెలిపారు.