టీబీ పేషేంట్ల కు అండగా టి. హెచ్.ఆర్ .

ప్రతీ నెల నేరుగా టి బి పేషంట్స్ చెంతకు టి. హెచ్.ఆర్ న్యూట్రిషన్ కిట్..

– సిద్దిపేట నియోజకవర్గం లో 265 మందికి మనోధైర్యం ఇవ్వనున్న మంత్రి హరీష్ రావు ..

– 4 రకాల పోషకాహారాల కిట్ పంపిణీకి నిర్ణయం

– అభాగ్యుల మనోవేదనకు అమాత్యుడి ఆత్మీయ కానుక

– నేడు కిట్స్ పంపిణీ చేయనున్న మంత్రి హరీష్ రావు ..

సిద్దిపేట బ్యూరో నవంబర్ 04( జనం సాక్షి )జబ్బు వచ్చిన బాధ కంటే ఎదుటివారి అవహేళనతో టి.బి పేషేంట్లు మనోవేదన చెందుతున్నారు.  అండగా నిలిచేవారు లేక చాలా మంది మనోధైర్యం కోల్పోతున్నారు. .  తమకు క్షయ వ్యాధి ఉందని చెప్పడానికి కూడా వెనుకాడుతూ ఇటు చికిత్సకు, అటు పోషకాహారానికి ధూరమవుతున్నారు. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తూ, ఆత్మీయ భరోసా కల్పించడానికి మంత్రి హరీష్ రావు మానవతా ధృక్పథంతో ఆలోచించారు. వ్యాధి తీవ్రతను నియంత్రించడంతో పాటు ఆరోగ్యం స్థిరంగా ఉండేలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు.  టీబీ పేషంట్ గా ఒక వైపు బాధ .. మరో వైపు ఆర్థిక స్థోమత లేని  బాధితులకు  4 రకాల పోషకాహారాలతో కూడిన న్యూట్రిషన్ కిట్ ను తన స్వంత ఖర్చులతో ఇవ్వడానికి ముందుకొచ్చారు.  సిద్దిపేట నియోజకవర్గం లోని 265 మంది టీబీ పేషంట్స్ కు 6 నెలల పాటు ప్రతి నెల వారి ఇంటికి చేరేలా నాణ్యత కలిగిన న్యూట్రిషన్ కిట్ ను ఆత్మీయ కానుకగా అందించనున్నారు. నేడు మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధితులకు మంత్రి హరీష్ రావు  అందజేయనున్నారు…

– బాధితులకు మానసిక ధైర్యం..టి. హెచ్.ఆర్ న్యూట్రిషన్ కిట్..

సంపాదన కోల్పోపోడం, కొన్ని నెలల పాటు  జబ్బుతో బాధపడడం వల్ల రోగుల్లో ఆత్మవిశ్వాసం పోతుంది.రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.. ఇలాంటి పరిస్థితి లో మంత్రి హరీష్ రావు టి బి పేషంట్స్ కు ఆరోగ్యానికి అండగా నిలవనున్నారు.. టి హెచ్ ఆర్  న్యూట్రిషన్ కిట్ సిద్దిపేట నియోజకవర్గం లోని 265 మంది రోగుల కోసం కిట్లు సిద్ధం చేయించారు.  ఆ కిట్ లో 3కిలోల బియ్యం , ఒక కిలో పప్పు , 300గ్రా ఆవు నెయ్యి , 30 కోడిగుడ్లు ఉంటాయ్. రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గం నుండి ఈ వినూత్నమైన మానవత్వ కార్యక్రమం ప్రారంభం కానుంది.. సిద్దిపేట జిల్లాలో 902 మంది టీబీ పేషంట్స్ ఉన్నారు.

 రోజుల్లో టీబీ పేషంట్స్ పట్టించుకొని.. ఆ రోగులను చూడగానే చీదరించుకుంటున్న  నేటి కాలంలో  మంత్రి హరీష్ రావు వారికి మనో ధైర్యాన్ని ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే గా,  మంత్రి గా , ప్రజల బాధలు తెలిసిన నాయకుడిగా టి.బి పేషంట్స్ కు వారిలో ఆత్మవిశ్వాసం… మనోధైర్యం.. నింపే పౌష్టికాహారం ఇచ్చి మానవత్వం చాటుకున్నారు మంత్రి హరీష్ రావు…..

– మనోధైర్యమే రోగానికి మందు..

టి బి రోగులు పడే బాధ అంత ఇంత కాదు.. వారికి రోగం ప్రబలినప్పటి నుండి వారిలో రోజు రోజు ఆత్మవిశ్వాసం పోగొట్టుకొని , రోగ నిరోధక శక్తి తగ్గి  కుమిలి పోతున్నారు. ఎంతటి వ్యాధినైనా మనోధైర్యంతో నయం చేసుకోవచ్చు.  రోగుల్లో ఆత్మ విశ్వాసం కల్పిస్తే అంతకు మించిన వైద్యం మరొకటి ఉండదు.  ఇదే రకంగా ఉమ్మడి జిల్లాలో ని ఎమ్మెల్యే లు తమ నియోజకవర్గాల్లో కిట్లు ఇవ్వాలని , టీబీ రోగులకి అండగా నివాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు..

తాజావార్తలు