టీమిండియా కోచ్ రేసులో సౌరభ్ గంగూలీ!

8a7ao1ak

న్యూఢిల్లీ:టీమిండియా కొత్త కోచ్ గా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ కోచ్ గా పనిచేసిన డంకెన్ ఫ్లెచర్ పదవీ కాలం వన్డే వరల్డ్ కప్ తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. అయితే ఆ రేసులో ఇప్పటికే సౌరభ్ గంగూలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విశ్వసనీయ సమచారం మేరకు టీమిండియా నూతన కోచ్ గా సౌరభ్ గంగూలీని నియమించేందుకు బీసీసీఐ మగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

సుదీర్ఘంగా టీమిండియాకు కెప్టెన్ గా సేవలందించిన గంగూలీ జట్టును ఉన్నతస్థాయిలో నిలపాడనడంలో ఎటువంటి సందేహాం లేదు. గత గంగూలీ రికార్డులను పరిగణలోకి తీసుకోనున్న బీసీసీఐ ఆ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, టీమిండియా కొత్త కోచ్ నియమాకాన్ని బీసీసీఐ ప్యానెల్ లోని సభ్యులతో పాటు, మాజీ జట్టు కెప్టెన్లు నిర్ణయించే అవకాశం ఉంది.