టీమిండియా మరో రికార్డు

టీమిండియా మరో రికార్డు
 మెల్బోర్న్: ప్రపంచ కప్లో టీమిండియా అద్భుతాలు చేస్తోంది. మరో రికార్డు సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఏడు జట్లనూ ఆలౌట్ చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డులపుటలకెక్కింది.

ప్రపంచ కప్ లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లోనూ అన్ని జట్లను ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ధోనీసేన ఇదివరకే రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా క్వార్టర్స్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఆలౌట్ చేసి మరో ఘనత సాధించింది. తాజా ఈవెంట్లో భారత్ 7 మ్యాచ్ల్లో 70 వికెట్లు పడగొట్టింది.