టీమిండియా ముందు భారీ విజయలక్ష్యం
ధాటిగా ఆడి 328 పరుగులు చేసిన ఆసిస్
సిడ్నీ,మార్చి26 (జనంసాక్షి) : ప్రపంచకప్ రెండో సెవిూ ఫైనల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ భారత్ ముందు 329 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. దూకుడుగా ఆడిన ఆసిస్ ప్లేయర్లు భారత్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతా పరుగుల వరద పారించారు. బౌలర్లు కట్టుదిట్టంగా బాల్స్ వేసినా పిచ్చ పరుగులకు అనుకూలం కావడంతో స్కోర్ పరుగెత్తింది. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఆలౌట్ చేసిన భారత్ ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగింది. ప్రపంచ కప్ సెవిూఫైనల్లో ఆస్టేల్రియా ఇప్పటివరకు ఓడిపోలేదు. టీమ్‌ఇండియా మూడింట్లో రెండు సార్లు గెలిచింది. ప్రారంభంలో విధ్వంసకర బ్యాటింగ్ ఆడే వార్నర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించినా.. ఫామ్‌లో ఉన్న స్మిత్ బంతికి ఒక పరుగుపై బడి ఆడుతూ శతకం సాధించి ఆసీస్ బ్యాటింగ్‌కి వూపు తెచ్చాడు. 34 ఓవర్ల వరకూ క్రీజులో ఉన్న స్మిత్ ఏ దశలోనూ భారత బౌలర్లు పైచేయి సాధించటానికి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఫించ్ తన సహజ సిద్ధమైన దూకుడును పక్కనబెట్టి స్మిత్‌కు అండగా నిలిచాడు. సిడ్నీలో ప్లాట్ పిచ్ విూద భారత బౌలర్లు ఇంతకు ముందు మ్యాచ్‌ల్లో చూపించిన ప్రభావాన్ని చూపలేకపోయారు. ఉమేశ్ యాదవ్, మోహిత్‌లు ఆరు వికెట్లు తీసినా.. నిర్ణీత ఓవర్లలో 70కి మించి పరుగులు ఇచ్చారు. అశ్విన్ ప్రమాదకరంగా పరుగులు పెడుతున్న మాక్స్‌వెల్‌ను ఔట్ చేసి ఊరట కలిగించినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు కొద్దిసేపే క్రీజులో ఉన్నా.. ఎక్కువ పరుగులు చేసేందుకు వెనకాడలేదు. పవర్ ప్లే ముందు, స్మిత్ ఔట్ అయిన తర్వాత భారత్ త్వరత్వరగా వికెట్లు తీసి పరుగుల వేగానికి అడ్డుకట్ట వేసినా.. ఫాల్కనర్, వాట్సన్, జాన్సన్‌లు వేగంగా పరుగులు తీసి ఆఖర్లో స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా జాన్సన్ 9 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 27 పరుగులు చేసి భారత్ వ్యూహాన్ని చేదించాడు. ఓ దశలో 300 లోపే స్కోర్ ముగుస్తుందనుకున్నా చివర్లో పరుగులకు స్కోర్ పరుగెత్తింది. భారత బౌలర్లలో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్న షవిూకి సెవిూస్‌లో ఒక వికెట్ కూడా రాలేదు. ఉమేశ్ 4, మోహిత్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు. స్మిత్(105) శతకం చేయటంతో పాటు ఓపెనర్ ఫించ్ 81 పరుగులు సాధించి ఆస్టేల్రియా పెద్దస్కోరు సాధించటంలో దోహదపడ్డారు. భారత్ బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్ కూడా గత మ్యాచ్‌ల్లో ఉన్నంత పకడ్బంధీగా లేకపోవటం గమనార్హం. స్మిత్ సెంచరీ, ఫించ్ అర్థసెంచరీలతో రాణించడంతో టీమిండియాకు ఆస్టేల్రియా 329 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను స్మిత్, ఫించ్ నిలబెట్టారు. రెండో వికెట్ కు 182 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 197 స్కోరు వద్ద వీరి భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ విడదీశాడు. సెంచరీ వీరుడు స్మిత్(105)ను అవుట్ చేశాడు. 232 పరుగుల వద్ద విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. 233 పరుగుల వద్ద ఫించ్ అవుటడవడంతో ఒక్క పరుగు తేడాతో ఆసీస్ 2 వికెట్లు చేజార్చకుంది. తర్వాత వరుసగా కెప్టెన్ క్లార్క్(10), ఫాల్కనర్(23), వాట్సన్(28) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. షవిూ భారత్ బౌలింగ్‌ను ప్రారంభించారు. షవిూ మొదటి బంతిని ఆఫ్‌స్టంప్ విూద సంధించగా ఆడటానికి ప్రయత్నించిన ఫించ్ విఫలమయ్యాడు. షవిూ ప్రపంచకప్‌లో షార్ట్ పిచ్ బంతులతో బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెడుతున్న విషయం విదితమే. భారత్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో
షవిూయే అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. వార్నర్ తాను ఆడిన మొదటి బంతిని డైవ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. షవిూ బౌలింగ్‌లో ఫించ్ మొదటిసారి ఫ్రంట్ ఫట్ విూద ఆడటానికి ప్రయత్నించగా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సందర్భంలో షవిూ చేసిన అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించారు. షవిూ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్న ఫించ్ ఐదో ఓవర్ మొదటి బంతిని సేయిట్ డ్రైవ్ ద్వారా బౌండరీ, రెండో బంతిని స్క్వేర్ లెగ్‌లోకి ఆడి రెండు పరుగులు సాధించి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు. ఆఖరి బంతిని ఫించ్ డీప్ మిడ్ వికెట్‌లోకి ఆడి మరో మూడు పరుగులు సాధించాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ కోల్పోయి ఆరు పరుగుల సరాసరితో స్కోరు బోర్డును ముందుకు దూకించింది.
అంతకుముందు భారత బౌలర్లు పరుగు తేడాతో రెండు కీలక వికెట్లు పడగొడతారు. అశ్విన్ బౌలింగ్లో మ్యాక్స్వెల్, ఉమేష్ యాదవ్ ఓవర్లో ఫించ్ అవుటయ్యారు.