టెంపోట్రాక్స్ వాహనం బహిరంగ వేలం
కరీంనగర్, నవంబర్ 26 : జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంనకు సంబంధించిన టెంపోట్రాక్స్ వాహనాన్ని మంగళశారం ఉదయం 11.00గంటలకు బహిరంగ వేలం వేయబడునని జిల్లా పౌరసంబంధాల అధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. వేలంలో పాల్గొనుటకు ఆసిక్త గల వారు మంగళవారం ఉదయం 11గంటలకు కలెక్టరేట్‌లో గల జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో జరుగు వేలంలో పాల్గొనవచ్చునని ఆయన పేర్కొన్నారు. వేలంలో పాల్గొను వారు ముందుగా ధరావత్తు సొమ్ము రూ.15000లు చెల్లించాలని, వేలంలో నెగ్గినవారు మిగిలిన సొమ్ము చెల్లించి వాహనాన్ని తీసుకుపోవచ్చునని డిపిఆర్వో తెలిపారు.